Sunday, April 6, 2025
HomeDEVOTIONALబంగారు గోపురాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బంగారు గోపురాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

యాద‌గిరిగుట్ట స‌న్నిధిలో సీఎం దంప‌తులు
న‌ల్ల‌గొండ జిల్లాలోని యాద‌గిరిగుట్ట‌ను సంద‌ర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. భారీ ఖ‌ర్చుతో నిర్మించిన బంగారు గోపురాన్ని ప్రారంభించారు. సీఎం తన భార్యతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంత‌రం దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేకంలో పాల్గొన్నారు. సుమారు రూ.80 కోట్లు ఖర్చు చేసి బంగారు గోపురాన్ని తయారు చేశారు, ఇది యాదగిరిగుట్ట ఆలయ గోపురం అందం, అలంకరణను మరింత పెంచుతుంది.

యాదగిరిగుట్ట ఆలయ అధికారులు గోపురం రూపక ల్పనలో అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. బంగారు గోపురం తయారీకి మత పెద్దలు, పూజారులు, ఆలయ నిర్మాణ నిపుణుల సూచనలు తీసుకున్నారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని బంగారు గోపురం నృసింహావతారాలు, లక్ష్మీ, కేశవ నారాయణ, గరుడమూర్తి చిత్రపటాలు వైభవంగా ప్రదర్శించనున్నారు. యాదగిరిగుట్ట బంగారు గోపురం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ గోపురం కావడం విశేషం.

ఇదిలా ఉండ‌గా సీఎంగా కొలువు తీరిన వెంట‌నే ఎనుముల రేవంత్ రెడ్డి కేసీఆర్ హ‌యాంలో గుట్టకు ఉన్న యాదాద్రి పేరును మార్చేశారు. ఈ మేర‌కు పూర్వ కాలం నుంచి వ‌స్తున్న యాద‌గిరిగుట్టగానే పిల‌వాల‌ని అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. తిరుమ‌ల త‌ర‌హాలో గుట్ట‌ను అభివృద్ది చేయాల‌ని కృత నిశ్చ‌యంతో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments