NEWSTELANGANA

జ‌గ్జీవ‌న్ రామ్ అరుదైన నేత‌

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కామెంట్

హైద‌రాబాద్ – ఈ దేశంలో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టిన గొప్ప నాయ‌కుడు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ జీవితం స్పూర్తి దాయ‌క‌మ‌ని అన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయ‌న స్పూర్తితోనే రాష్ట్ర స‌ర్కార్ అనేక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింద‌ని స్ప‌ష్టం చేశారు.

రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారని గుర్తు చేశారు సీఎం. జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి త‌మ‌ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విడి విడిగా ఉండేవన్నారు. దళితులు, గిరిజనులు, బీసీ మైనార్టీలందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా అధికారులను ఆదేశించామ‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి.

ప్రతీ నియోజకవర్గంలో ఒకే క్యాంపస్‌లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు చేసి కులాల మధ్య అంతరాలు చేరిపేయాలని అనుకుంటున్నామ‌ని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌లో శంకుస్థాపన చేశామ‌ని తెలిపారు సీఎం.

చదువు మీద పెట్టేది ఖర్చు కాదని, అది పెట్టుబడి అని, చదువుకుంటేనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఈ సందర్భంగా పలు ఉదాహరణలను వివరించారు రేవంత్ రెడ్డి. లోక్‌సభ స్పీకర్‌గా తెలంగాణ బిల్లుకు ఆమోదించింది ఎవ‌రో కాద‌ని జగ్జీవన్ రామ్ కూతురు మీరాకుమారి అని ఈ సంద‌ర్బంగా ఆమెకు రుణ‌ప‌డి ఉన్నామ‌ని అన్నారు.

తెలంగాణ రాష్ట్రమంతా ఆమెను ఎప్పుడూ గుర్తు చేసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ ప్రసాదకుమార్‌, మంత్రులు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతకుమారి పాల్గొన్నారు.