పెద్దమ్మ తల్లి సాక్షిగా రుణాలు మాఫీ
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి మరోసారి రైతు రుణాల మాఫీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన దేవుళ్లు, దేవతల మీద ఒట్లు వేయడం రివాజుగా మారింది. విచిత్రం ఏమిటంటే దేవుళ్ల మీద ఒట్లు తన మీద తిట్లు తప్ప ఇంక సీఎం చేసింది ఏమీ లేదంటూ ఈ మధ్యనే ఓ ఛానల్ లో ముఖాముఖి సందర్బంగా బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఎద్దేవా చేశారు.
శనివారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా తాను ప్రకటన చేస్తున్నానని, ఇప్పటి దాకా తాము ఇచ్చిన హామీ మేరకు రైతులు తీసుకున్న రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేసి తీరుతామని ప్రకటించారు రేవంత్ రెడ్డి.
ఇందులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఆగస్టు 15 తారీఖు లోపు ప్రతి ఒక్క రైతు తీసుకున్న రుణాలను తీరుస్తామని స్పష్టం చేశారు. కొందరు దద్దమ్మలు, సోయి లేనోళ్లు తమపై అవాకులు చెవాకులు పేలుతున్నారని వారి మాటలు అస్సలు పట్టించు కోవద్దంటూ కోరారు సీఎం.