వైద్య రంగానికి సర్కార్ ప్రాధాన్యత
స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. పేదలు, సామాన్యులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడం తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఇందు కోసం ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ. 5000 కోట్లతో వైద్య రంగంలో డెవలప్మెంట్ చేస్తామని తెలిపారు సీఎం.
రూ. 921 కోట్లతో ప్రతి 30 కిలోమీటర్ల కి ఒక ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు ఎ. రేవంత్ రెడ్డి. రూ. 350 కోట్లతో జిల్లాకు ఒక డి అడిక్షన్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
600 కోట్లతో కొత్త డయాగ్నస్టిక్స్ హబ్స్ తో పాటు ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్లతో, 35 వ్యాసిక్యూలర్ సెంటర్లస్ , 10 ఫుడ్ టెస్ట్ ల్యాబ్స్ , 10 డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబ్స్ లను ఏర్పాటు చేస్తామని చెప్పారు అనుముల రేవంత్ రెడ్డి. మొత్తం మీద వైద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.