నా వారసుడు అతడే
రేవంత్ రెడ్డి కామెంట్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తర్వాత సీఎం అయ్యే ఛాన్స్ ఒక్కడికే ఉందన్నారు. అతడు ఎవరో కాదు నల్లగొండ జిల్లాకు చెందిన షేర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.
పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా ఉలికి పాటుకు గురయ్యారు. ప్రస్తుతం రేవంత్ సీఎం పదవిలో ఉండగా డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయనతో పాటు గతంలో డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజ నరసింహ పని చేశారు.
తాజాగా జరిగిన పీసీసీ కీలక సమావేశంలో కూడా చివరి దాకా పలువురు సీఎం పోస్టు కోసం పోటీ పడ్డారు. రేసులో చివరి దాకా ప్రయత్నం చేసిన వారిలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, దామోదర పేర్లు ఎక్కువగా వినిపించాయి.
కానీ పార్టీ హై కమాండ్ మాత్రం ఎనుముల రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన నోటుకు ఓటు కేసు ఎదుర్కొంటున్నారు. జూలై 24 డెడ్ లైన్ విధించింది సుప్రీంకోర్టు. ఇచ్చే తీర్పుపై సీఎం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.