NEWSTELANGANA

ఆరు నూరైనా మాట నిల‌బెట్ట‌కుంటాం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – సీఎం అనుముల రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇచ్చిన మాట నిల‌బెట్టు కోవ‌డం త‌మ పార్టీ ముఖ్య ల‌క్ష‌ణ‌మ‌ని పేర్కొన్నారు. రైతు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు పడుతుంటే కొంత మంది గుండెల్లో పిడుగులు పడుతున్నాయంటూ మండిప‌డ్డారు.

సంక్రాంతి పండుగ‌ తర్వాత రైతు భరోసా ఖాతాల్లో వేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి. వరి వేస్తే ఉరి అని ఆనాటి పాలకులు అన్నారని గుర్తు చేశారు. కానీ తాము అలా కాద‌న్నారు. రూ.500 బోనస్‌ ఇస్తామని తాము ఇప్ప‌టికే చెప్పామ‌ని , ఆచ‌ర‌ణ‌లో చేసి చూపిస్తామ‌ని చెప్పారు సీఎం.

ఈ ఏడాది దేశంలోనే తెలంగాణ రికార్డు స్థాయి ధాన్యాన్ని పండించ‌డం జ‌రిగింద‌న్నారు. రూ. 7 ల‌క్ష‌ల కోట్లు త‌మ నెత్తిన మీద పెట్టి వెళ్లి పోయాడంటూ మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి మండిప‌డ్డారు. ప్ర‌తి నెలా అస‌లు, వ‌డ్డీ క‌లిపి రూ. 6 వేల కోట్ల‌కు పైగా చెల్లిస్తున్నామ‌ని చెప్పారు.