మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది
గ్లోబల్ హెచ్ సీసీ హబ్ సమావేశంలో సీఎం
అమెరికా – మీ అందరితో సమావేశం కావడం తన జీవితంలో మరిచి పోలేనంటూ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. అమెరికా పర్యటనలో ఆయన బిజీగా ఉన్నారు. ఆయా కంపెనీలకు చెందిన ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో సీఈవోలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వం కంపెనీలకు, పెట్టుబడిదారులకు సానుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రపంచంలోని ప్రముఖ యూనివర్శిటీలతో పోటీ పడే విధంగా తాము త్వరలోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో ప్రవాస భారతీయులు పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు.
ఫార్మా, ఐటీ, ఈవో, బయో టెక్ , లాజిస్టిక్ రంగాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టామని చెప్పారు. ఇందుకు సంబంధించిన కంపెనీలకు చెందిన సిఇఓలతో సంభాషించడం మరింత సంతోషాన్ని కలిగించిందని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి.
హైదరాబాద్‌కు 425 సంవత్సరాల గొప్ప చరిత్ర ఉందన్నారు. ఒక రకంగా చూస్తే దాదాపు అమెరికాతో సమానంగా ఉందన్న విషయం గుర్తు చేశారు. ఈ గ్లోబల్ సమ్మిట్ లో కార్నింగ్ కంపెనీకి చెందిన రోనాల్డ్ ఎల్ వర్కీ, దినేష్ వలివాల్, సిగ్నా కంపెనీకి చెందిన ఎక్రమ్ సర్పర్, బిల్ నూనన్ , ఎస్వీ అంచన్ , సంజీవ్ అహూజా, చింటూ పటేల్ , రవి లోచన్ పోలా, సుబ్బారావు, అమిత్ కుమార్ , పునీత్ లోచన్ , వీర బుధ్ది , శ్రీ అట్లూరి, జోనాథన్ హిల్, అరుణ్ ఉపాధ్యాయ, స్వామి కొచ్చెర్ల కోట, అశ్విన్ పన్సే ఉన్నారు.