సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలకు సంబంధించి ఎలాంటి సర్వే చేపట్ట లేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో సర్వే వివరాలు ప్రకటించారు. మొత్తం 3 కోట్ల 54 లక్షల 77 వేల 554 మందిని సర్వే చేశామన్నారు. ఎస్సీలు 17.43 శాతం , ఎస్టీలు 10.45 శాతం , బీసీలు 46.25 శాతం ఉన్నారని తెలిపారు. గతంలో సరైన లెక్కలు లేవన్నారు.
ఎవరికి తోచిన రీతిలో వారు లెక్కలు వేసుకున్నారంటూ మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా జనాభా లెక్కించినా బీసీల గురించి పట్టించు కోలేదన్నారు. మంగళవారం జరిగిన అసెంబ్లీలో ప్రసంగించారు ఎ. రేవంత్ రెడ్డి.
ఎన్నో ఏళ్లుగా జనాభా లెక్కిస్తున్నా బలహీనా వర్గాల జనాభాను లెక్కించలేదన్నారు. .. బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగలేదని వాపోయారు.. బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే.. కులగణన చేయాలని రాహుల్ గాంధీ భావించారని చెప్పారు సీఎం.
ఎస్సీలు 61 లక్షల 84 వేల 319 ఉండగా ఎస్టీలు 37 లక్షల 5 వేల 929 మంది ఉన్నారని ఇక బీసీల పరంగా చూస్తే మైనార్టీలు కాకుండా భారీ జనాభా ఉందన్నారు. 1 కోటి 64 లక్షల 9 వేల 179 మంది ఉన్నారని తెలిపారు. ముస్లిం మైనార్టీలు 35 లక్షల 76 వేల 588 మంది ఉన్నారని బీసీలతో కలిపితే 56. 33 శాతంగా ఉన్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇక ఓసీల విషయానికి వస్తే 47 లక్షల 21 వేల 115 మంది ఉన్నారని వీరి శాతం 13.51 అని తెలిపారు.