ఆ నిర్ణయం నాది కాదు
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర గుర్తును మార్చడం పట్ల పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అవుతోంది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వారితో పాటు పలువురు మేధావులు, కవులు, కళాకారులు సైతం మండి పడుతున్నారు.
సోషల్ మీడియాలో సీఎం తీనుకున్న నిర్ణయం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో మంగళవారం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించారు. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమని పేర్కొన్నారు.
రాచరిక ఆనవాళ్లకు ఇక్కడ చోటు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయని తెలిపారు. త్యాగాలు, పోరాటాలు గుర్తొచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు సీఎం.
రాజముద్ర రూపకల్పన బాధ్యత ఫైన్‌ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్‌కు ఇచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందెశ్రీకే అప్పగించామని వెల్లడించారు రేవంత్ రెడ్డి. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. ఎవరితో సంగీతం చేయించు కోవాలనేది అందెశ్రీదే నిర్ణయమన్నారు.