అద్భుత ఘట్టం మధుర జ్ఞాపకం
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తన జీవితంలో మరిచి పోలేని రోజుగా ఆయన అభివర్ణించారు. ఇది కలకాలం తాను బతికి ఉన్నంత వరకు మధుర జ్ఞాపకంగా నిలిచి పోతుందని పేర్కొన్నారు సీఎం.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణ మాఫీ చేయడం జరిగిందని చెప్పారు. శుక్రవారం ప్రజా భవన్ లో లబ్ది పొందిన రైతులకు చెక్కులను అందజేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ , సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కే. కేశవరావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సీఎం మాట్లాడారు. రాష్ట్ర రైతాంగా చరిత్రలో రుణాల మాఫీ అద్భుతమైన ఘట్టంగా నిలిచి పోతుందన్నారు. అప్పుల ఊబిలో కూరుకు పోయి ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు. కోట్లాది మందికి అన్నం పెట్టే అన్నదాతలు యాచించే స్థితికి రాకూడదనే తాము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.
ప్రజా ప్రభుత్వం ఏకకాలంలో రూ. 2 లక్షల రుణ మాఫీ చేయడం జరిగిందన్నారు. రైతన్నలకు ఆపన్న హస్తం అందించామన్నారు .