వర్చువల్ గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 630.27 కోట్ల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రూ.200 కోట్లతో జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు, రూ.5.5 కోట్లతో ఘన్‌ఫూర్‌లో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు, రూ.45.5 కోట్లతో ఘన్‌ఫూర్‌లో 100 పడకల ఆస్పత్రికి, రూ.26 కోట్లతో ఘన్‌ఫూర్‌లో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.148.76 కోట్లతో దేవాదుల రెండో దశ పూర్తి చేసేందుకు కూడా శ్రీకారం చుట్టారు.
274 ఇండ్లు ఘన్‌పూర్ నియోజకవర్గ మండలాలకు, 238 ఇండ్లు ధర్మసాగర్ , వేలైర్ మండలాలకు రూ.15 కోట్లతో R/F NH రహదారి నుంచి మల్లన్నగండి నుంచి తాటికొండ, జిట్టగూడెం నుంచి తరిగొప్పుల వరకు రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రూ. 1 కోటితో స్టేషన్ ఘన్‌పూర్‌లో NPDCL డివిజనల్ ఆఫీస్ కమ్ ERO ఆఫీస్ భవనం నిర్మాణం, రూ.2 కోట్లతో బంజారా భవన్ నిర్మాణం, రూ.1.76 కోట్లతో కుడా ఆధ్వర్యంలో పెద్దపెండ్యాల గ్రామంలో రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు, రూ.102.1 కోట్లతో మహిళా శక్తి కింద ఏడు RTC బస్సులు మంజూరు (రూ.2.10 కోట్లు), స్వయం సహాయ సంఘాలకు రూ.100 కోట్ల బ్యాంక్ లింకేజ్ ను ప్రారంభించారు.