NEWSTELANGANA

రూ. 1,800 కోట్లు విడుద‌ల చేయండి

Share it with your family & friends

నిర్మ‌లా సీతారామ‌న్ కు సీఎం విన‌తి

ఢిల్లీ – రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ‌లోని వెనుక‌బ‌డిన జిల్లాల‌కు పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

ఆమె ఛాంబ‌ర్‌లో ముఖ్య‌మంత్రి శుక్ర‌వారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వెనుక‌బ‌డిన జిల్లాల‌కు కేంద్రం నుంచి రావ‌ల్సిన గ్రాంటుపై చ‌ర్చించారు. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో తెలంగాణ‌లోని తొమ్మిది జిల్లాల‌కు ఏటా రూ.450 కోట్ల చొప్పున గ్రాంటు విడుద‌లకు అంగీక‌రించార‌ని ఆయ‌న గుర్తు చేశారు.

2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవ‌త్స‌రాలకు సంబంధించిన గ్రాంటును ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేయ‌లేద‌ని, నాలుగేళ్ల‌కు క‌లిపి పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరారు.

రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత హైద‌రాబాద్‌లోని హైకోర్టు, రాజ్ భ‌వ‌న్‌, లోకాయుక్త‌, రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌, జ్యుడిషియ‌ల్ అకాడ‌మీ స‌హా ఇత‌ర ఉమ్మ‌డి సంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌ను రూ.703.43 కోట్ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వ‌మే భ‌రించింద‌ని..ఏపీ వాటా రూ.408.49 కోట్ల‌ను తెలంగాణ‌కు చెల్లించాల్సి ఉంద‌న్నారు.

తెలంగాణ నుంచి ఏక‌ప‌క్షంగా రూ.2,547.07 కోట్ల రిక‌వ‌రీకి కేంద్ర ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా ఆదేశాలు ఇచ్చింద‌ని వాపోయారు. సీఎం వెంట ఎంపీలు మ‌ల్లు ర‌వి, బ‌ల‌రాం నాయ‌క్ , అనిల్ కుమార్ యాద‌వ్ , క‌డియం కావ్య‌, మాజీ ఎంపీ హ‌నుమంత‌రావు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *