నితిన్ గడ్కరీతో సీఎం భేటీ
కొత్త రహదారులు ఇవ్వండి
న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు. ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని తన నివాసంలో కలుసుకున్నారు.
ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను ఆయన ముందు ఉంచారు. వెంటనే ఇప్పటికే మంజూరు చేసిన రహదారుల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరారు. చాలా చోట్ల రహదారుల నిర్మాణం పూర్తి కాలేదన్నారు.
అంతే కాకుండా తమ రాష్ట్రానికి అదనంగా కొత్త రహదారులను మంజూరు చేయాలని కోరారు నితిన్ గడ్కరీని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎక్కడెక్కడ రోడ్లను ఏర్పాటు చేయాలనే దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈ సందర్బంగా నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.