NEWSTELANGANA

అడోబ్ సిస్ట‌మ్స్ సీఈవోతో సీఎం భేటీ

Share it with your family & friends

శంత‌ను నారాయ‌ణ్ తో క‌ల‌వ‌డం ఆనందం

అమెరికా – ప్ర‌పంచంలోనే ప్ర‌ఖ్యాత సంస్థ‌గా పేరు పొందిన అడోబ్ సిస్ట‌మ్స్ సిఈవో శంత‌ను నారాయ‌ణ్ తో శుక్ర‌వారం భేటీ అయ్యారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.

ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం కాలిఫోర్నియాలో పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లలో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు.

ఈ సంద‌ర్బంగా అడోబ్ సిస్ట‌మ్స్ తో ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి శంత‌నుతో కీల‌క స‌మావేశం కావ‌డం విశేషం. తెలంగాణలో ప్రజాప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిటీ ఏర్పాటు తదితర ప్రణాళికలపై శంత‌ను నారాయ‌ణ‌కు వివ‌రించారు.

దీనిపై ఆస‌క్తి క‌న‌బ‌ర్చారు అడోబ్ సిస్ట‌మ్స్ సీఈవో. ఈ ప్రాజెక్టుల‌లో పాలు పంచుకునేందుకు అంగీకారం తెలిపారు. ప్రపంచానికి హైదరాబాద్ అందించిన ప్రసిద్దుల్లో ఒకరు శాంతను నారాయణ అని ప్ర‌శంసించారు ఎ. రేవంత్ రెడ్డి.