NEWSTELANGANA

గ‌వ‌ర్న‌ర్ తో ముఖ్య‌మంత్రి భేటీ

Share it with your family & friends

కుల గ‌ణ‌న‌పై క్లారిటీ ఇచ్చిన రేవంత్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి మ‌ర్యాద పూర్వ‌కంగా త‌న మంత్రివ‌ర్గంతో క‌లిసి రాజ్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే (కుల గ‌ణ‌న‌)కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియ చేశారు.

ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు.

రాష్ట్రంలో ప్రారంభమైన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును గవర్నర్ కు వివరించారు ఎ. రేవంత్ రెడ్డి. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలను అడిగి తెలుసుకున్నారు గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ‌.

సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలవనుందని తెలిపారు.

2025 చేపట్టే దేశ వ్యాప్త జనగణలో తెలంగాణ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ , కులసర్వేను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గ‌వ‌ర్న‌ర్ ను కోరారు ముఖ్య‌మంత్రి.

ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి రావాల్సిందిగా కూడా విన్న‌వించారు గ‌వ‌ర్న‌ర్ కు.