గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
కేఎస్ రాధాకృష్ణన్ కు అభినందన
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ కేఎస్ రాధాకృష్ణన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయనతో రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై చర్చించారు.
ఇదిలా ఉండగా ఇంఛార్జ్ గవర్నర్ గా ఉన్న కేఎస్ రాధాకృష్ణన్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ సూచనల మేరకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో త్రిపురకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మను నియమించారు.
ప్రస్తుతం ఉన్న కేఎస్ రాధాకృష్ణన్ పూర్తి స్థాయి గవర్నర్ గా మహారాష్ట్రకు బాధ్యతలు అప్పగించారు. కొత్త గవర్నర్ కు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. మరాఠా గవర్నర్ గా నియమించినందుకు కేఎస్ రాధాకృష్ణన్ ను ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.
తమతో కలిగిన అనుబంధం మరిచి పోలేనదని, ఇలాగే మహారాష్ట్ర ప్రజలకు సేవలు అందజేస్తారని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు . కేఎస్ రాధాకృష్ణన్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు. ఆయన స్వస్థలం తమిళనాడు రాష్ట్రం. కీలక పదవులు చేపట్టారు. వాటికి వన్నె తెచ్చేందుకు ప్రయత్నం చేశారు.