నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తో సీఎం భేటీ
రూ. 1800 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి
న్యూఢిల్లీ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తో పాటు సుమన్ భేరీతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంటు రూ. 1800 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. వీటిని రిలీజ్ చేయక పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానంగా హైదరాబాద్ లో మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్దికి నిధులు ఇప్పించాలని సూచించారు.
ఇందుకు అవసరమైన ప్రపంచ బ్యాంకు ఎయిడ్ విడుదలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటు రాష్ట్రంలో తమ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు సపోర్ట్ చేయాలని సూచించారు.
గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది గురించి పట్టించు కోలేదని, దీని వల్ల అదనపు భారం తమపై పడుతోందని ఆవేదన చెందారు. దీనిని దృష్టిలో పెట్టుకుని యుద్ద ప్రాతిపదికన నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.