సోనియమ్మా పోటీ చేయమ్మా
అభ్యర్థించిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఏఐసీసీ ప్రముఖులను కలిశారు. అంతకు ముందు భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీతో ముచ్చటించారు. త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో 17 సీట్లు ఉన్నాయి. ఈసారి క్లీన్ స్వీప్ చేయాలని కంకణం కట్టుకున్నారు రేవంత్ రెడ్డి.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టితో కలిసి నేరుగా ఏఐసీసీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈసారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని విన్నవించారు. ఈ సందర్బంగా సోనియా గాంధీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని, తొందర పడవద్దంటూ సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఏ మేరకు ప్రజలకు అందుబాటులో ఉందనే దానిపై ఆరా తీశారు. ఆరు గ్యారెంటీలు అవుతున్నాయా , ప్రజలు ఏమనుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేశారు సోనియా గాంధీ.