DEVOTIONAL

ఆన్ లైన్ లో నిలువెత్తు బంగారం

Share it with your family & friends

ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రపంచంలోనే ల‌క్ష‌లాది మంది త‌ర‌లి వ‌చ్చే ఏకైక జాత‌ర స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌. ఇప్ప‌టికే ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. చాలా మంది వెళ్ల లేని భ‌క్తుల కోసం సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

శాస‌న స‌భ క‌మిటీ మాలులో ఆన్ లైన్ ద్వారా మేడారం స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ల‌కు నిలువెత్తు బంగారం స‌మ‌ర్పించే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ మేర‌కు ఆయ‌న బ‌ట‌న్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రులు కొండా సురేఖ‌, పొన్నం ప్ర‌భాక‌ర్, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ న‌ర‌సింహ‌, ఎమ్మెల్యేల‌తో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీఎస్ శాంతి కుమారి, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా సీఎం రేవంత్ రెడ్డి త‌న మ‌నవ‌డు రియాన్స్ రెడ్డికి సంబంధించి నిలువెత్తు బంగారాన్ని ఆన్ లైన్ ద్వారా స‌మ‌ర్పించారు . ఇదే స‌మ‌యంలో త‌న మ‌న‌వ‌రాలి నిలువెత్తు బంగారాన్ని స‌మ‌ర్పించారు మంత్రి శ్రీ‌నివాస్ రెడ్డి. మేడారానికి వెళ్ల లేని భ‌క్తుల కోసం దీనిని ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు సీఎం.