స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలి
యుద్ద ప్రాతిపదికన జరగాలని ఆదేశం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఆయన ప్రధానంగా నైపుణ్యాభివృద్దిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అపారమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన యువతీ యువకులు ఉన్నారని వారిని మరింత రాటు దాల్చేలా చర్యలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్ కీలక సమావేశం జరిగింది.
ఇప్పటికే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో నైపుణ్యాభివృద్దిలో గేమ్ ఛేంజర్ గా భావిస్తోన్న ‘స్కిల్ యూనివర్సిటీని యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం.
తెలంగాణ యువతను ప్రపంచంలోనే మెరుగైన నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలని ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు రేవంత్ రెడ్డి.
ఐటీ కంపెనీలతో పాటు అధునాతన పరిశ్రమలన్నింటికి అందుబాటులో ఉన్నందున గచ్చిబౌలి ప్రాంతంలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.