శాంతి భద్రతలపై దృష్టి పెట్టండి
సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లో సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నానని అన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
సోమవారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాజాగా ప్రముఖ నటుడు అల్లు అర్జున్ , అల్లు అరవింద్ కు సంబంధించిన ఇంటిపై కొందరు కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. పూల కుండీలను ధ్వంసం చేశారు. ఆపై రాళ్లు రువ్వారు. దీంతో ఈ ఘటనలో సంబంధం ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించారు.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు సీఎం. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అల్లు అర్జున్ కు సంబంధించి కేసు కోర్టులో ఉందన్నారు. ఈ సమయంలో ఎవరూ కూడా జోక్యం చేసుకోవడం తగదని సూచించారు రేవంత్ రెడ్డి.