కేసీఆర్..కేటీఆర్ లపై కేసులకు సిద్దం
ఎట్టకేలకు నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – ఓ వైపు ప్రజాగ్రహం కొనసాగుతోంది. ఆరు గ్యారెంటీల అమలు అటకెక్కింది. కేవలం దూషణలు, ఆరోపణలు, తిట్ల పురాణంతోనే సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతోంది. ఈ తరుణంలో ఏదో రకంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి, ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ లను ఎలాగైనా సరే జైలుకు పంపించాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. తనను ఒకనాడు ఇబ్బంది పెట్టినందుకు ఆయన లోలోపట రగిలి పోతున్నారు. ఇప్పటికే ఫార్ములా వన్ కారు రేస్ కు సంబంధించి రూ. 46 కోట్ల రూపాయలు రూల్స్ కు విరుద్దంగా ముందస్తుగా విదేశీ కంపెనీకి చెల్లించారంటూ కేటీఆర్ పై ఆరోపించారు.
ఆపై కేసు నమోదు చేయాల్సిందిగా ఏసీబీని ఆదేశించారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు సంస్థ కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మను కోరింది. ఆయన న్యాయ నిపుణుల సలహాలను తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో తండ్రీ కొడుకులు అరెస్ట్ కు మార్గం సుగమమైంది.
దీనిపై కేబినెట్ చర్చించింది. ఈ సందర్బంగా సీఎం నిర్ణయం పట్ల మంత్రుల్లో చీలక వచ్చింది. హాట్ హాట్ గా సాగింది. సగం మంత్రులు పెదవి విరిచినట్లు సమాచారం. వ్యక్తిగత కక్షలతో కేసులు పెడితే పార్టీకి తీరని నష్టం కలుగుతుందని చెప్పినా సీఎం వినిపించు కోలేదు. మరికొందరు మంత్రులు సీఎంకు వంత పాడినట్లు తెలిసింది. చివరకు కేసులు నమోదుకే మొగ్గు చూపారు రేవంత్ రెడ్డి.