ప్రకటించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – హైదరాబాద్ లోని చార్మినార్ గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈమేరకు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు సాయంగా ప్రకటించామని తెలిపారు.
ఇదిలా ఉండగా చార్మినార్ దగ్గర చోటు చేసుకున్న ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. స్పాట్ లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా చికిత్స పొందుతూ మరో 14 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అభిషేక్ (30), ఆరూషి జైన్ (17)..హర్షాలీ గుప్తా(7), శీతల్ జైన్ (37), రాజేందర్(67), ప్రియాన్షీ(6), ప్రథమ్(13), సుమిత్ర (65)..మున్నీబాయ్ (72), ఇరాజ్(2) ఉన్నారు. మృతుల్లో ఎక్కువగా బెంగాల్ వాసులే ఉన్నారు. బంధువుల ఇంటికి వచ్చారు. అనుకోకుండా అగ్ని ప్రమాదానికి ఆహుతయ్యారు.
ఈ ప్రమాదం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు దేశ ప్రధాని మోదీ, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.