అందెశ్రీ గర్వించ దగిన కవి
సన్మానించడం సంతోషం
హైదరాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తన నివాసంలో ఆయన ప్రముఖ కవి, గాయకుడు, సహజ కవి అందెశ్రీ దంపతులను ఘనంగా సన్మానించారు. వారిని సత్కరించడం తన జీవితంలో గుర్తుండి పోయే సందర్భమని పేర్కొన్నారు.
తాను తెలంగాణ ఉద్యమ సమయంలో ఎందరో కవులు రాసిన పాటలను, కవితలను, గాయకులు పాడిన పాటలను , గీతాలను విన్నానని, వాటితో స్పూర్తి పొందానని ఈ సందర్బంగా మరోసారి గుర్తు చేసుకున్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
అందెశ్రీ తెలంగాణ మాగాణికే మణి హారం అంటూ కొనియాడారు. ఆయన హృదయాంతరాళల్లో నుండి ఉద్భవించిన అద్భుతమైన గీతం జయ జయహే తెలంగాణ తనను ఎంతగానో ప్రభావితం చేసిందని తెలిపారు సీఎం. ఈ గీతాన్ని తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించామని అన్నారు . ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో భాగమేనని స్పష్టం చేశారు.