NEWSTELANGANA

అబ్దుల్ క‌లాం జీవిత‌మే ఓ సందేశం – సీఎం

Share it with your family & friends

ఆయ‌న అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

హైద‌రాబాద్ – భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన మ‌హోన్న‌త మాన‌వుడు మిస్సైల్ మ్యాన్ డాక్ట‌ర్ ఏపీజే అబ్దుల్ క‌లాం అని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. మంగ‌ళ‌వారం దివంగ‌త రాష్ట్ర‌ప‌తి క‌లాం జ‌యంతి సంద‌ర్బంగా ఆయ‌న చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కొండా సురేఖ‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వేం నరేందర్ రెడ్డి, విప్ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. క‌లాం జీవిత‌మే ఓ సందేశ‌మ‌ని పేర్కొన్నారు. జాతికి ఆయ‌న అందించిన సేవ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు. ఆయ‌న‌ను చూసి నేర్చు కోవాల్సింది చాలా ఉంద‌న్నారు.

ప్ర‌ధానంగా దేశం కోసం, ప్రజల కోసం, విద్యార్థుల కోసం జీవితాంతం శ్రమించిన మహనీయుడు కలాం అని కొనియాడారు.

విద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఎనలేని సేవలందించిన కలాం చిరస్మరణీయులు అని పేర్కొన్నారు. డాక్ట‌ర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆద‌ర్శ ప్రాయమ‌ని పేర్కొన్నారు .

నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించి, భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప శాస్త్ర‌వేత్త క‌లాం అని ప్ర‌శంసించారు. దేశం కోసం త‌న జీవితాన్ని అంకితం చేసిన కలాం జీవితం ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంద‌ని అన్నారు ఎ. రేవంత్ రెడ్డి.