NEWSTELANGANA

చిర‌స్మ‌ర‌ణీయుడు పీజేఆర్

Share it with your family & friends

సీఎం ఎ. రేవంత్ రెడ్డి నివాళి
హైద‌రాబాద్ – మాజీ మంత్రి, దివంగ‌త పీజేఆర్ పేదల దేవుడ‌ని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. జీవిత కాల‌మంతా కార్మికులు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం ప‌ని చేశాడ‌ని అన్నారు. పీజేఆర్ వ‌ర్దంతి సంద‌ర్బంగా ఆయ‌న చిత్ర ప‌టానికి పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం పేద‌ల గుండెల్లో పీజేఆర్ చిర‌స్థాయిగా నిలిచి పోతార‌ని అన్నారు సీఎం.

కాగా పి. జ‌నార్ద‌న్ రెడ్డి. ఖైర‌తాబాద్ ఎమ్మెల్యేగా 1978, 1985, 1989, 1994, 2004 లలో వరుసగా గెలిచాడు. మంత్రిగా ప‌ని చేశారు. కార్మికుల, అణ‌గారిన వ‌ర్గాల ప‌క్ష‌పాతిగా ఉన్నారు. పిలిచే ప‌లికే నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. డిసెంబ‌ర్ 28న పార్టీ కార్య‌క్ర‌మానికి వెళుతుండ‌గా గుండెపోటుతో కుప్ప‌కూలారు. ఆయ‌న చేసిన సేవ‌లు ఎల్ల‌ప్ప‌టికీ గుర్తుండి పోతాయ‌ని సీఎం అన్నారు.

జ‌న‌వ‌రి 12, 1948లో పుట్టారు. ఆయ‌న‌కు ప్ర‌జ‌లంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. స‌రిగ్గా 2007 డిసెంబ‌ర్ 28న మృతి చెందారు. ఆయ‌న‌ను అంద‌రూ పీజేఆర్ గా ఆప్యాయంగా పిలుచుకుంటారు. కార్మిక నాయ‌కుడిగా పేరొందారు. కాంగ్రెస్ పార్టీలో కీల‌క‌మైన నేత‌గా ఎదిగారు. వ‌రుస‌గా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలువ‌డం మామూలు విష‌యం కాదు.

1967లో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు హైదరాబాద్ ఆల్విన్, కేశవ్రామ్ సిమెంట్స్, ఎన్టిపిసి, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ వంటి కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహించాడు.

అసోసియేటెడ్ గ్లాస్ ఇండస్ట్రీస్ వర్కర్స్ యూనియన్, ఎపి ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్, కృషి ఇంజిన్‌లకు అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *