Monday, April 21, 2025
HomeNEWSమ‌హ‌నీయురాలు సావిత్రిబాయి పూలే

మ‌హ‌నీయురాలు సావిత్రిబాయి పూలే

సీఎం రేవంత్ రెడ్డి ఘ‌నంగా నివాళి

హైద‌రాబాద్ – సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జ‌యంతి సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. చ‌దువు విలువ గుర్తించిన గొప్ప వ్య‌క్తి అని కొనియాడారు. అన్ని వ‌ర్గాల‌కు చ‌దువు ద‌క్కాల‌ని అహ‌ర్నిశ‌లు కృషి చేశార‌ని కొనియాడారు. ఆమెను స్మ‌రించు కోవ‌డం అంటే విద్య విలువ‌ను గుర్తించ‌డ‌మేన‌ని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జ‌యంతి జ‌ర‌పాల‌ని ఆదేశించామ‌న్నారు సీఎం.

ఇదిలా ఉండ‌గా మహిళల అభ్యున్నతికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రి బాయి పూలే . 1840లో తనకు 9 సంవత్సరాల వయసులోజ్యోతిరావు పూలేతో వివాహం జరిగింది. వీరికి సంతానం కలగక పోవడంతో అనాధ అయిన యశ్వంత్ను దత్తపుత్రుడుగా స్వీకరించారు.

పూలె దంపతులు 1848 జనవరి 1న మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. 1848 మే 12న దేశంలో తొలి బహుజనుల పాఠశాలను నెల‌కొల్పారు సావిత్రి బాయి పూలె. ఆధిపత్య కులాల నుంచి అనేక దాడులు, అవమానాలను ఎదుర్కొంటూ 1849లో దంపతులిద్దరూ గృహ బహిష్కరణకు గురయ్యారు.

1852లో సేవా మండల్ అనే సంఘాన్ని స్థాపించి మహారాష్ట్రలో భర్త పూలే స్థాపించిన ‘సత్యశోధక ‘సమాజ ఉద్యమంలో సావిత్రీ భాయి కీలక పాత్ర పోషించారు.1868 అంటరానితనానికి, పితృ స్వామిక‌ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడారు.

మహిళా చైతన్యానికి , మూఢ నమ్మకాలకు సతీ సహగమునకు వ్యతిరేకంగా పోరాడారు. వితంతు పునర్వివాహాల కొరకు ఉద్యమించారు. కుల వ్యవస్థను వ్యతిరేకించారు. 1896 –97 లో ప్లేగు వ్యాధితో కరువుతో మహారాష్ట్ర మొత్తం అతలాకుతలం అయింది. దీనికోసం సావిత్రిబాయి పూలే జోలె పట్టి విరాళాలు సేకరించింది. ఈ క్రమంలోనే తనకు ప్లేగు వ్యాధి వచ్చి 1897 మార్చి 10న మరణించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments