సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ప్రముఖ ప్రపంచ దిగ్గజ సంస్థ అమ్జెన్ సంస్థ రావడం ఆనందంగా ఉందన్నారు. గత ఏడాది ఆగస్టులో శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లినప్పుడు అమ్జెన్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను సందర్శించానని చెప్పారు.
లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్నాలజీకి హబ్ గా ఉన్న తమతో భాగస్వామ్యం కావాలని కోరడం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. తన పిలుపునకు స్పందించిన అమ్జెన్ సంస్థ ఇన్నోవేషన్ సెంటర్ ను ఇవాళ నగరంలో ప్రారంభించడం మరిచి పోలేనని అన్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఫార్మా, లాజిస్టిక్ రంగాలలో హైదరాబాద్ టాప్ లో ఉందన్నారు. తమ ప్రజా ప్రభుత్వం కొలువు తీరాక పలు సంస్థలు, వ్యాపారవేత్తలకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అంతే కాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం కోట్లాది రూపాయలను కేటాయించడం జరిగిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇక్కడి విద్యార్థులను తీర్చిదిద్దుతామని, ఇది తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.