సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల త్యాగాలు వెలకట్ట లేనివన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ రచించిన ‘విజయ తెలంగాణ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు . ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబాన్ని ఏకి పారేశారు. తెలంగాణ చరిత్ర అంటే కేసీఆర్ చరిత్ర కాదన్నారు. ఉద్యమకారులను పదేళ్లు పట్టించు కోలేదన్నారు. వారు చేసిన త్యాగాల గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. సీఎంతో సమానమైన అధికారాన్ని వదులుకుని తెలంగాణ కోసం ముందుకు వచ్చారన్నారు.
మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ గురించి ప్రశంసలు కురిపించారు. ఆయనతో తనకు దగ్గరి అనుబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తను కూడా కీలక పాత్ర పోషించారని కితాబు ఇచ్చారు. ప్రాణహిత-చేవెళ్ల కోసం అలుపెరుగని పోరాటం చేశారంటూ తెలిపారు.
సీఎంతో సమానమైన అధికారాన్ని వదులుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుకు వచ్చారని కొనియాడారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. టీజీని మొదటగా దేవేందర్‌గౌడ్ నిర్ణయించారన్నారు. అందుకే ప్రభుత్వ పరంగా టీజీ ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.
లండన్ తరహా మ్యూజియం రావాలన్నారు.. తెలంగాణ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతపు చరిత్ర, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ.. తెలంగాణ చరిత్ర కాదన్నారు.