NEWSTELANGANA

ఎమ్మెల్యే ఔదార్యం సీఎం సంతోషం

Share it with your family & friends

పేద విద్యార్థులకు బాటా బూట్లతో బాసట
హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు పాల‌మూరు జిల్లా లోని జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే జ‌నుంప‌ల్లి అనిరుధ్ రెడ్డి. ఆయ‌న ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త కూడా. ప్ర‌తి ఏటా కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ కింద సాయం చేస్తూ వ‌స్తుంటారు.

తాజాగా జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే పేద విద్యర్థులకు బాటా బూట్లను ఉచితంగా ఇచ్చే వినూత్న కార్య‌క్ర‌మానికి శుక్ర‌వారం సీఎం శ్రీ‌కారం చుట్టారు. లాంఛ‌నంగా త‌న నివాసంలో ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా అద్బుత‌మైన ఈ సాయం చేసే కార్య‌క్ర‌మాన్ని తీసుకు వ‌చ్చినందుకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని అభినందించారు.

ఈ సంద‌ర్బంగా నియోజ‌క‌వ‌ర్గంలోని పాఠశాలల విద్యార్థులకు బాటా బూట్లను అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యా రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమణాలను మరింతగా మెరుగు పర్చలన్న లక్ష్యం తోనే గత ఏడాది కంటే రూ.2199 కోట్లు అధిక మొత్తాన్ని ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో విద్యా రంగానికి కేటాయించామని తెలిపారు.

2023-24 సంవత్సరంలో విద్యా రంగానికి రూ.19,093 కోట్లను గత ప్రభుత్వం కేటాయించగా ఈ ఏడాది తమ ప్రభుత్వం రూ.21,292 కోట్ల మొత్తాన్ని విద్యా రంగానికి కేటాయించడం జరిగిందని రేవంత్ రెడ్డి వివరించారు.

విద్యా రంగంలోని అన్ని సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వేలాది మంది పేద విద్యార్థులకు అనిరుధ్ రెడ్డి బ్రాండెడ్ బూట్లను అందించడం గొప్ప‌నైన విష‌య‌మ‌ని ప్రశంసించారు.