మత సామరస్యం వెల్లి విరియాలి
పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – మనుషలంతా ఒక్కటేనని అది భాగ్యనగరం నిరూపిస్తోందని అన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేదా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఆరు నూరైనా మోదీ, షా ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లను తొలగించ లేరంటూ హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని పేర్కొన్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలోని ఎంఐఎం పార్టీ ఇఫ్తార్ విందులో చేరడం సంతోషంగా ఉందన్నారు . దీనిని చూస్తే మనది లౌకిక ప్రభుత్వం అని ప్రజలకు అర్థమై పోతుందన్నారు.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో లాల్ బహదూర్ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తమ సర్కార్ మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తుందని చెప్పారు సీఎం.