ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలి
అమెరికా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. ఆయన న్యూయార్క్, తదితర ప్రాంతాలను సందర్శించారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న అంధ క్రికెటర్ల జట్టుతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కళ్లు లేక పోయినా అద్భుతంగా రాణించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో పట్టుదలతో అనుకున్నది సాధించేందుకు మీరు చేస్తున్న ప్రయత్నం తనను ఆశ్చర్య పోయేలా చేసిందన్నారు ఎ. రేవంత్ రెడ్డి.
సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తమ కలలను నెరవేర్చుకోవాలనే సంకల్పం కోసం ప్రయత్నం చేస్తున్న తీరు ఇతరులకు స్పూర్తి దాయకంగా నిలుస్తుందన్నారు. న్యూయార్క్ అంధ బాలుర జట్టును కలుసుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు.
సంకల్పం సమున్నతమైతే దానిని ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకే సాగాలని అంధ క్రికెటర్లను చూస్తే తెలుస్తుందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మీరు ఏది కావాలన్నా, ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు సీఎం.