సీఎం మోదీ జపం
ఆయన నా పెద్దన్న
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి స్వరం మారింది. ఆయన ఊహించని రీతిలో ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీని ప్రశంసించడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా వేదికగా జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని ఆకాశానికి ఎత్తేశారు. అంతే కాదు మోదీ తనకు పెద్దన్న లాంటి వారంటూ కితాబు ఇచ్చారు.
దీంతో వేదిక పైన ఉన్న ప్రధానమంత్రితో పాటు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, కానీ అభివృద్ది వరకు మాత్రం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్ సంబంధాలు ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
తాము ఫెడరల్ స్పూర్తికి అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నట్లయితే తాము కూడా గుజరాత్ లాగా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి.