సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థి, కార్మిక, కర్షక, మేధావులు, సంబండ వర్ణాలు కలిసి పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. ఎంసీహెచ్ఆర్డీ లో ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగులపై ప్రశంసల జల్లులు కురిపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, ఆ పాత్రను మరిచి పోలేమన్నారు. ఏ పార్టీ వల్లనో వచ్చిందంటే అది సత్య దూరమే అవుతుందన్నారు రేవంత్ రెడ్డి. తాము ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు.
ఆరు గ్యారెంటీల అమలులో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు సీఎం. మీరు ఉండడం వల్లనే, పోరాటం చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని స్పష్టం చేశారు. కొందరు తమ వల్లనే వచ్చిందంటూ ప్రచారం చేసుకుంటున్నారని అందుకే వారిని పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి.
తమ ప్రభుత్వం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు సీఎం.