రక్షక దళం రాష్ట్రానికి అవసరం
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారంటూ పోలీసులను ప్రశంసించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. పోలీస్ శాఖలో కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి సీఎం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల జాబ్స్ భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు.
ఇక పోలీసులు లేక పోతే పాలన కష్టం అవుతుందన్నారు. వారు రేయింబవళ్లు కష్టపడి పని చేస్తారంటూ కితాబు ఇచ్చారు సీఎం. తెలంగాణను సురిక్షత రాష్ట్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ప్రకటించకుండా ఉన్న జాబ్స్ ఫలితాలను వెంట వెంటనే ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు 15,750 మంది ఎంపికయ్యారని వారందరికీ నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణకు మన రక్షక దళం దేశానికి రోల్ మోడల్ గా ఉన్నారని పేర్కొన్నారు.