ఆర్టీసీకి రూ. 500 కోట్ల తక్షణ సాయం
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – నష్టాలలో ఉన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కి కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇప్పటికే రూ. 500 కోట్ల రూపాయలు తక్షణ సాయంగా అందజేసింది. మహాలక్ష్మి పథకం కింద బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించింది. పల్లె వెలుగుతో పాటు ఎక్స్ ప్రెస్ బస్సులలో ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది ఆర్టీసీ.
ఇదిలా ఉండగా ఆర్టీసీ తెలంగాణ ప్రజలందరిదని , దీనిని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాం వద్ద 100 కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అంతే కాకుండా బస్సులో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రయాణం చేశారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దాసరి సీతక్క తో పాటు ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి ఉన్నారు.