NEWSTELANGANA

మ‌గ్ధుంపూర్ పిల్ల‌ల‌కు సీఎం కంగ్రాట్స్

Share it with your family & friends

ఉచిత బ‌స్సు ప్ర‌యాణం భేష్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా శుక్ర‌వారం స్పందించారు. అరుదైన ఫోటోను పంచుకున్నారు స్వ‌యంగా. త‌మ ప్ర‌భుత్వం కొలువు తీరిన త‌ర్వాత ప్ర‌వేశ పెట్టిన ఉచిత బ‌స్సు మ‌హిళ‌ల ప్ర‌యాణం వ‌ల్ల ఎన్ని ఉప‌యోగాలు క‌లుగుతున్నాయో తెలిపారు.

ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వ బ‌డుల‌కు స్వ‌యంగా పిల్ల‌లు త‌మ ఆధార్ కార్డుల‌తో బ‌స్సుల‌లో ప్ర‌యాణం చేయ‌డాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి సిద్దిపేట జిల్లా నంగునూరు మండ‌లం ముగ్దుంపూర్ జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్న బాలిక‌ల‌ను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు సీఎం.

వీరిని చూస్తుంటే త‌న‌కు అంతులేని ఆనందాన్ని క‌లిగిస్తోంద‌ని పేర్కొన్నారు. ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్ల గలుగుతున్నారని ప్ర‌శంసించారు. బాలిక‌లు ఆధార్ కార్డులు చూపిస్తూ సంతోషం వ్య‌క్తం చేస్తుంటే చెప్ప‌లేనంత సంతోషం క‌లుగుతోంద‌ని తెలిపారు రేవంత్ రెడ్డి.