పెట్టుబడులపై రేవంత్ రెడ్డి ఫోకస్
అమెరికా టూర్ పై అంతటా ఉత్కంఠ
అమెరికా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా టూర్ లో భాగంగా న్యూయార్క్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు సాదర స్వాగతం లభించింది ప్రవాస తెలంగాణ వారి నుంచి. పార్టీకి సంబంధించిన నేతలు, అభిమానులతో పాటు వివిధ వ్యాపార, వాణిజ్య వ్యాపారవేత్తలు, కంపెనీల ప్రతినిధులు ఆయనను కలుసుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో 10 రోజులకు పైగా ఉంటారు. ఈ సందర్బంగా ఆయన ఆగస్టు 13న తిరిగి హైదరాబాద్ విచ్చేస్తారు. ఈసారి ఎక్కువ రోజులు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు . ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకు రావడం పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
ఇప్పటికే వివిధ శాఖల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. తనతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కూడిన బృందం కూడా రేవంత్ రెడ్డితో పాటే ఉంది. ఇదిలా ఉండగా ఇటీవలే స్కిల్ యూనివర్శిటీ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు సీఎం. ఈ యూనివర్శిటీ దేశానికే తల మానికంగా తయారు చేయాలని ఆదేశించారు. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి కంపెనీలు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇది నడుస్తుంది.
ఐటీ, లాజిస్టిక్, హెల్త్ , ఫార్మా , తదితర రంగాలలో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేయాలని ప్రతిపాదించే ఛాన్స్ ఉంది.