NEWSTELANGANA

తెలంగాణ ప్ర‌భుత్వ క్యాలెండ‌ర్ విడుద‌ల

Share it with your family & friends

పాల్గొన్న క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్

హైద‌రాబాద్ – రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి సంబంధించి కీలక‌మైన క్యాలెండ‌ర్ ను 2024కు సంబంధించి విడుద‌ల చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంలో సీఎంతో పాటు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, హోం శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జితేంద‌ర్ , ప్రింటింగ్ అండ్ స్టేష‌న‌రీ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ హాజ‌ర‌య్యారు.

ప్ర‌తి ఏటా నూత‌న ఏడాదిని పుర‌స్క‌రించుకుని క్యాలెండ‌ర్ ను రూపొందించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈసారి సీన్ మారింది. గ‌తంలో కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఉండేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాల‌న మొద‌లైంది.

ఆయ‌న వ‌చ్చాక రూట్ మార్చారు. ప్ర‌జ‌ల‌తో క‌నెక్టివిటీ పెంచుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. కీల‌క‌మైన‌, సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఒక ర‌కంగా ప్ర‌జా పాల‌న సాగించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. దీంతో నిన్న‌టి దాకా నిద్ర పోయిన అధికారులంతా ఇప్పుడు మేల్కొన్నారు. మొత్తంగా పాల‌న అంటే ఇలా ఉండాల‌ని చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి.