10న యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో
హైదరాబాద్ – తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు కొనసాగింపుగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 10న భారత్ జోడో న్యాయ్ యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్బంగా మారథాన్ కు సంబంధించి తయారు చేసిన పోస్టర్ ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు సచివాలయంలో.
ఈ సందర్బంగా సీఎం యూత్ కాంగ్రెస్ ను అభినందించారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీజేపీకి ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. గత ఏడాది రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అద్భుతమైన రీతిలో స్పందన వచ్చిందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
ఈ దేశంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కులం, మతం పేరుతో రాజకీయం చేస్తోందని, దీనిని అడ్డం పెట్టుకుని పవర్ లోకి రావాలని అనుకుంటోందని ఆరోపించారు. ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు నీతికి, అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి.