విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రకటించిన డీఎస్సీని రద్దు చేసినట్లు ప్రకటించారు. తాజాగా కొత్తగా ఏకంగా 10 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి.
మొత్తం 11 వేల 62 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంతో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
తాము చెప్పినట్టుగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్నారు సీఎం. ఇప్పటికే గురుకులాల, పోలీస్ పోస్టులకు సంబంధించి నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు రేవంత్ రెడ్డి.
ఎలాంటి అపోహలు పడవద్దని , కష్టపడి ప్రిపేర్ కావాలని సూచించారు సీఎం. పారదర్శకంగా భర్తీ చేయడం జరుగుతుందన్నారు.