NEWSTELANGANA

మ‌హిళ‌ల కోసం టీసేఫ్ యాప్

Share it with your family & friends

పోస్ట‌ర్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్

హైద‌రాబాద్ – తెలంగాణ పోలీస్ శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు పెద్ద పీట వేసేలా ప్ర‌త్యేకంగా టెక్నాల‌జీ సాయంతో కొత్త యాప్ ను త‌యారు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు డీజీపీ ర‌వి గుప్తా. ఈ మేర‌కు టీ సేఫ్ పేరుతో త‌యారు చేసిన పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు స‌చివాల‌యంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.

ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం. మ‌హిళ‌లు రాష్ట్ర అభివృద్దిలో కీల‌కంగా మారార‌ని కొనియాడారు సీఎం. మహిళల భద్రత కోసం వారి ప్రయాణాలను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక సేవలను అందించేందుకు యాప్ త‌యారు చేయ‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌ని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

మహిళలు ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో భద్రతకు తక్షణ సహాయం అందించడానికి, లైవ్‌ లొకేషన్‌ షేర్ చేయడానికి, ప్రయాణ మార్గం నావిగేట్‌ చేయడానికి, ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులు అప్రమత్తం కావడానికి వీలైన అనేక ప్రత్యేక ఫీచర్లతో టీ సేఫ్ యాప్‌ రూపొందించినట్టు ఈ సంద‌ర్బంగా డీజీపీ ర‌వి గుప్తా సీఎం రేవంత్ రెడ్డికి వివ‌రించారు.