NEWSTELANGANA

తెలంగాణ జ‌ర్న‌లిస్టుల డైరీ ఆవిష్క‌ర‌ణ

Share it with your family & friends

జ‌ర్న‌లిస్టుల‌కు స‌హ‌కారం అందిస్తాం

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి జ‌ర్న‌లిస్టుల‌కు తీపి క‌బురు చెప్పారు. వారి స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక 2024 సంవత్సరం డైరీని ఆవిష్క‌రించారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేందుకు జర్నలిస్టులు తమ వంతు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మహ్మద్ సాదిక్ పాష, వైస్ ప్రెసిడెంట్లు కోడురు శ్రీనివాసరావు, జంగిటి వెంకటేష్, జాయింట్ సెక్రటరీ మ‌ధు మల్కేడికర్, కోశాధికారి సురేశ్ వేల్పుల, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సోము సముద్రాల, కంచెరాజు తదితరులు పాల్గొన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.