NEWSTELANGANA

భారీ వ‌ర్షం అప్ర‌మ‌త్తత అవ‌స‌రం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. సోమ‌వారం భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు.

భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం. కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని స్ప‌ష్టం చేశారు.

భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం పోలీస్ బెటాలియన్ల కు ఎన్డీఆర్ఎఫ్ తరహా లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి.

వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. అంతే కాకుండా వరదల్లో చని పోయిన పశువులు, మేకలు, గొర్రెల కు పరిహారం పెంచాలని ఆదేశించారు సీఎం.

వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. తక్షణమే కేంద్ర సాయం కోరుతూ లేఖ రాయాలని సీఎస్ ను ఆదేశించారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరాల‌ని సూచించారు రేవంత్ రెడ్డి.

వ‌ర‌ద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్ల లకు తక్షణ సాయం కోసం ఒక్కో జిల్లాకు రూ.5 కోట్ల సాయం అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.