Sunday, April 6, 2025
HomeNEWSబీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై సీఎం స‌మీక్ష

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై సీఎం స‌మీక్ష

హాజ‌రైన డిప్యూటీ సీఎం..మంత్రులు

హైద‌రాబాద్ – రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే నివేదిక‌పై స‌మీక్ష చేప‌ట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా బీసీ నేత‌ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా బీసీ కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించారు.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల ప్ర‌భుత్వం స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే చేప‌ట్టారు. నివేదిక‌ను అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్ర‌క‌టించారు. మొత్తం తెలంగాణ జ‌నాభా 3,54,77,554 గా తేల్చారు. బీసీలు 56.33..ఎస్సీలు 17.43 ..ఎస్టీలు 10. 45 శాతమ‌ని వెల్ల‌డించారు. 1,12,15,134 కుటుంబాలు కాగా , ఎస్సీల జ‌నాభా 61,84,319 ఉండ‌గా 17.43 శాతంగా ఉంది. ఎస్టీల జ‌నాభా 37,05,929 ఉండ‌గా 10.45 శాతంగా ఉంది. బీసీల జ‌నాభా 1,64,09,179 ఉండ‌గా రాష్ట్ర జ‌నాభాలో 46.25 శాతంగా ఉంగా. ఓసీల జ‌నాభా 15.79 శాతం కాగా 10.8 ముస్లిం, బీసీల‌ను క‌లిపితే రాష్ట్రంలో 56.33 శాతంగా ఉండ‌నున్నారు.

ఈ మొత్తం స‌ర్వే త‌ప్పుల త‌డ‌క‌గా ఉంద‌ని, బీసీల జ‌నాభాను కావాల‌ని త‌క్కువ చేసి చూపించారంటూ బీసీ సంఘాలు, నేత‌లు, మేధావులు ఆరోపించారు. ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీంతో గ‌త్యంత‌రం లేక స‌ర్వేను పొడిగించింది. ప్ర‌స్తుతం స‌మీక్ష చేప‌ట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments