NEWSTELANGANA

జీవో నెంబ‌ర్ 46 ర‌ద్దుపై స‌మీక్ష

Share it with your family & friends

పున‌రాలోచ‌న‌లో సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది జీవో నెంబ‌ర్ 46పై. గ‌తంలో కొలువు తీరిన కేసీఆర్ స‌ర్కార్ ఈ జీవోను తీసుకు వ‌చ్చింది. దీని వ‌ల్ల రాష్ట్రంలో భ‌ర్తీ చేప‌ట్ట‌నున్న ఉద్యోగాల‌లో ఈ జీవో వ‌ల్ల తీవ్ర‌మైన అన్యాయం జ‌రుగుతోంద‌ని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల‌కు హామీ ఇచ్చారు. తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తే త‌క్ష‌ణ‌మే జీవో 46 ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. స‌ర్కార్ కొలువు తీరి రెండు నెల‌లు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా నిరుద్యోగులు రోడ్డు పైకి వ‌చ్చారు.

రాత్రి ఇదే అంశానికి సంబంధించి జూబ్లీ హిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు స‌మీక్ష చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి డీజీపీ ర‌వి గుప్తా , సీఎస్ శాంతి కుమారి కూడా హాజ‌ర‌య్యారు.

పోలీస్ నియామ‌కాల్లో జీవో నెంబ‌ర్ ర‌ద్దు చేయాలా వ‌ద్దా అనే అంశంపై చ‌ర్చ‌లు జ‌రిపారు. త్వరలో కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్ సలహా, సూచనలు ఇవ్వాల‌ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.