ఇక నుంచి గద్దరన్న పేరుతో అవార్డులు
హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రాష్ట్ర సర్కార్ తరపున సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజా యుద్ద నౌకగా పేరు పొందిన గాయక దిగ్గజం దివంగత గద్దర్ పేరు మీద ఇక నుంచి అవార్డులు అందజేయనున్నట్లు ప్రకటించారు.
గద్దర్ ఒక వ్యక్తి కాదని ఆయన మహా శక్తి అని కొనియాడారు. గతంలో ఉమ్మడి ప్రభుత్వం ఉన్న సమయంలో నంది పేరుతో పురస్కారాలు అందజేశారని , కానీ తాము వచ్చాక ప్రజల కోసం పాటలు పాడుతూ , తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప, అరుదైన గాయకుడు గద్దర్ అని ప్రశంసలు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఆయన జయంతిని తమ ప్రభుత్వం ఇక నుంచి అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు. ప్రతి ఏటా జనవరి 31న గద్దర్ జయంతి ఉంటుందన్నారు. ఆయనకు ఇచ్చే అపురూపమైన నివాళి ఇది మాత్రమేనని స్పష్టం చేశారు.
తనకు ఒక్కటే ఆనాడు గద్దర్ చెప్పారు. రాజకీయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎవరినైనా ఢీకొన వచ్చని కానీ నేర పూరితమైన లీడర్ తో జాగ్రత్తగా ఉండమని సూచించారని గుర్తు చేసుకున్నారు. అందుకే కేసీఆర్ పట్ల చాలా జాగ్రత్తగా ఉన్నానని చెప్పారు రేవంత్ రెడ్డి.