NEWSTELANGANA

త్యాగ ధ‌నుల ఫ‌లితం నేటి ప‌ర్వ‌దినం

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కామెంట్

హైద‌రాబాద్ – దేశానికి స్వేచ్ఛ ల‌భించి నేటితో 78 ఏళ్ల‌వుతోంది. ఎంద‌రో త్యాగ‌ధ‌నుల, బ‌లిదానాల ఫ‌లిత‌మే ఈ ప‌ర్వ‌దినం అని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆగ‌స్టు 15ను పుర‌స్క‌రించుకుని ఆయ‌న ప‌రేడ్ గ్రౌండ్స్ లో జాతీయ ప‌త‌కాన్ని ఎగుర వేశారు. అంత‌కు ముందు అమ‌ర వీరుల‌కు నివాళులు అర్పించారు. పోలీసుల నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు.

ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. బ్రిటీష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తం అయిన రోజు. ఈ రోజుకు అత్యంత ప్ర‌త్యేక‌మైన చ‌రిత్ర ఉంది. ఇవాళ కోట్లాది మంది ప్ర‌జ‌లు స్వేచ్ఛాయువ‌త వాతావ‌ర‌ణంలో బ‌తుకుతున్నామంటే గ‌తంలో ల‌క్ష‌లాది మంది బ‌లిదానాలు చేయ‌డం వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని అన్నారు.

ఇవాళ 143 కోట్ల మంది ప్ర‌జ‌లంద‌రికీ పండుగ రోజు. మన దేశ అస్థిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని పేర్కొన్నారు సీఎం. ఈ పండుగ వేళ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, దేశ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.