Sunday, April 20, 2025
HomeNEWSబంజారాలు సేవాలాల్ బాట‌లో న‌డ‌వాలి

బంజారాలు సేవాలాల్ బాట‌లో న‌డ‌వాలి

పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – సంత్ సేవా లాల్ బాటలో బంజారాలు న‌డ‌వాల‌ని పిలుపునిచ్చారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. గురువారం హైద‌రాబాద్ లో శ్రీ సంత్ సేవా లాల్ జ‌యంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు సీఎం.

తాండాల‌ను అభివృద్ది చేయ‌డం జ‌రుగుతుంద‌ని ప్ర‌క‌టించారు. గ‌త ప్ర‌భుత్వం తీవ్రంగా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆరోపించారు సీఎం. అన్ని తండాల‌లో బ‌డులు నిర్మించే బాధ్య‌త తీసుకుంటామ‌న్నారు. తండాలు చ‌దువుల త‌ల్లులు కావాల‌ని పిలుపునిచ్చారు.

గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేస్తామ‌న్నారు. గ్రామ పంచాయతీలుగా మారిన తండాలకు పంచాయతీ భవనాలు నిర్మిస్తామ‌న్నారు. కరెంటు, తాగునీరు.. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాల‌ని సూచించారు రేవంత్ రెడ్డి.

అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్స్ లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామ‌న్నారు . చదువుకున్నప్పుడే సమాజంలో గౌరవం ఉంటుందన్నారు. బంజారాలు చదువుల బాట పట్టండి.. సంత్ సేవాలాల్ మార్గంలో నడవండి అని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments