చంద్రబాబు గురువు కాదు ఫ్రెండ్
స్పష్టం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ఛానల్ తో ముచ్చటించారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే పాలిటిక్స్ గురించి వేసిన ప్రశ్నకు తల తిక్కగా ఆన్సర్ ఇచ్చారు. చంద్రబాబు మీ గురువు కదా ఆయన మాట ఇప్పుడు వింటారా అంటే తీవ్రంగా స్పందించారు.
ఆయన తనకు గురువు ఏంటి అని ప్రశ్నించారు. తాను ముందు నుంచి రాజకీయాలలో ఉన్నానని స్పష్టం చేశారు. యువకుడిగా ఉన్నప్పుడే లీడర్ నని చెప్పారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, ఇదే సమయంలో రాజకీయాలలోకి రావాలన్నది తన కల అని దానిని సాకారం చేసుకున్నానని అన్నారు.
ప్రతి లీడర్ కు ఎమ్మెల్యేనో లేదా ఎంపీనో లేదా మంత్రినో కావాలని అనుకుంటారని కానీ తాను మాత్రం ఇవేవీ కావాలని కోరుకోలేదన్నారు. కేవలం ఒకే ఒక్క సీటు కోరుకున్నానని , అది ముఖ్యమంత్రి పదవి మాత్రమేనని స్పష్టం చేశారు. దానిని సాధించేందుకు అహర్నిశలు కృషి చేశానని చెప్పారు. ఎవరన్నా తనకు చంద్రబాబు అని అంటే ముడ్డి మీద తంతానని అన్నారు రేవంత్ రెడ్డి.